Monday, 18 August 2025
Easy German - Who stands for the people ?
Easy German learning - Menschheit
ఒక యువకుడు ప్రతి సంవత్సరం జరిగే కంపెనీ మీటింగ్ కు వెళ్ళాడు .అక్కడ పగలంతా మీటింగ్ లతో బిజీగా గడిపి హోటల్ రూంకి వచ్చేసరికి అలసిపోయాడు .ఆకలితో ఉన్న ఆ యువకుడు త్వరత్వరగా రెడీ అయి రెస్టారెంట్ లోకి అడుగుపెట్టాడు.
Ein junger Mann besuchte die jährliche Firmenversammlung. Er war den ganzen Tag mit Besprechungen beschäftigt und kam müde ins Hotelzimmer zurück. Der hungrige junge Mann machte sich schnell fertig und betrat das Restaurant.
ఆకలిని పెంచే అద్బుతమైన వంటకాల వాసనలు, చక్కగా శుబ్రంగా ఉన్న రెస్టారెంట్ వాతావరణం ఇంకేం కావాలి....హుషారుగా పరోటా ను , పన్నీర్ బటర్ మసాలాను ఆర్డర్ చేసి తినటానికి రెడీ అయిపోయాడు.
Der herrliche Duft der Gerichte machte ihn hungrig, und die gepflegte und saubere Atmosphäre des Restaurants – was wollte er mehr? Er bestellte schnell eine Parota und ein Paneer Butter Masala und machte sich zum Essen bereit.
పరోటా నోట్లో పెట్టుకోబోతూండగా .... ఎందుకో బయటికి చూసిన అతనికి, ఆకలిగా లోపలికే చూస్తున్న రెండు కళ్ళు… పదేళ్ళైనా నిండని కళ్ళలో ఆకలి కనిపించాయ్. ఆకలితో ఆశగా హోటల్ అద్దాలలోంచి టేబుళ్ళ మీద పదార్థాలను చూస్తున్నాయి ఆ కళ్ళు. అతని మనసు ద్రవించిపోయింది.
Als er gerade die Parotta in den Mund stecken wollte, sah er aus irgendeinem Grund nach draußen und sah zwei Augen, die hungrig nach innen starrten. Der Hunger war in Augen zu sehen, die nicht einmal zehn Jahre alt waren. Diese Augen starrten hungrig durch die Hotelfenster auf die Zutaten auf den Tischen. Sein Herz schmolz dahin.
ప్లేట్ అక్కడే వదిలేసి బయటకి వచ్చాడు. ఆపసివానిని దగ్గరకు పిలిచాడు. ఆపిల్లవాడికి కొంచెం పక్కలో ఉన్న మరో పసి పాప అతని చెల్లెలు..ఇద్దరినీ తనతో పాటు లోపలికి పిలిచాడు. ఇద్దరూ లోపలికి వచ్చారు. మురికి బట్టలు, చెప్పులు లేని కాళ్ళూ, బెరుకు చూపులు.... తన టేబుల్ దగ్గరే వారినీ కూర్చో బెట్టి అడిగాడు “ఏం తింటారు?”
Er ließ den Teller dort stehen und kam heraus. Er rief den Kellner herbei. Er rief das andere kleine Mädchen, seine Schwester, die etwas weiter vom Apfelverkäufer entfernt stand. Sie kamen beide mit ihm herein. Schmutzige Kleidung, barfuß und wütende Blicke … Er ließ sie an seinem Tisch Platz nehmen und fragte: „Was wollt ihr essen?“
ఇద్దరి పిల్లల వేళ్ళూ అతని ప్లేట్ వైపే చూపించారు.నవ్వుతూ ఆ ఇద్దరికి కూడా తనతో పాటే ఫుడ్ ఆర్డర్ ఇచ్చాడు.పరోటా ముట్టుకోబోతూ ఆగిపోయిన పిల్లవాడు తన చెల్లెలిని తీసుకొని వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి ...తన చేతులు కడుక్కొని , తన చెల్లెలి చేతులూ కడిగి మెల్లగా వచ్చి తినటం మొదలు పెట్టారు.
Beide Kinder zeigten mit dem Finger auf seinen Teller. Lächelnd bestellte er für beide Essen. Das Kind, das gerade die Parotta anrühren wollte, blieb stehen und führte seine Schwester zum Waschbecken. Es wusch sich die Hände, wusch auch die seiner Schwester und begann langsam zu essen.
ఎంతో ఆశగా, ఆకలిగా, ఎంతో ఇష్టంతో నిజమైన ఆకలికి ఉండే భక్తితో ఆ పరోటాలనే చూస్తూ తిన్నారు ఇద్దరి పసివాళ్ళ పొట్టలూ.. వాళ్ళకి ఆకలి తీర్చిన ఆ యువకుడి మనసూ తృప్తిగా నిండిపోయాయ్. ఆ పిల్లలు ఇద్దరినే చూస్తూ .... బిల్ల్ తెమ్మని చెప్పిన అతను చేతులు కడుక్కొని వచ్చేసరికి టేబుల్ మీద బిల్ స్లిప్…చేతిలోకి తీసుకుని అలా చూస్తూనే ఉండిపోయాడు....అతని కంట్లోంచి జారిన కన్నీటి చుక్క స్లిప్ మీద పడేసరికి తేరుకొని…
Voller Hoffnung, Hunger und großer Sehnsucht aßen die beiden Kinder das Essen mit der Hingabe wahren Hungers. Auch der Magen des jungen Mannes, der seinen Hunger gestillt hatte, war voller Zufriedenheit. Er sah die beiden Kinder an … Als er sie bat, die Rechnung zu bringen, wusch er sich die Hände und kam zurück. Er sah die Rechnung auf dem Tisch liegen … Er nahm sie in die Hand und betrachtete sie … Als eine Träne, die ihm aus dem Auge gefallen war, auf den Zettel fiel, wachte er auf …
కౌంటర్ దగ్గర కూచున్న మనిషి వైపు చూసాడు… అక్కడ కూచున్న వ్యక్తి చిరునవ్వుతో ఇతన్నే చూస్తున్నాడు...మళ్ళీ ఒక సారి బిల్ వైపు చూసాడతను అక్కడ ఏం రాసి ఉందో తెలుసా..!?
Er sah den Mann an, der an der Theke saß ... Der Mann, der dort saß, sah ihn mit einem Lächeln an . Er sah sich die Rechnung noch einmal an und sah, was dort geschrieben stand ...!?
“మానవత్వానికి బిల్ వేసే యంత్రాలు ఇక్కడలేవు” అని.
Hier gibt es keine Maschinen, die der Menschheit Rechnungen stellen.“
“
.