Sunday, 3 July 2016

The story of a German Teacher


   



 This is the story of the student who came from Delhi to learn German language in Vijayawada. HIs name is Manjyoth sing. He is a B.Tech student. Manjyoth read articles and blogs about Eazy foreign Languages in Vijayawada. 


He came all the way from Delhi to learn German language in Vijayawada. I was surprised. 
He also said "I have seen many of your German language training videos in youtube.  He wanted to stay in a hotel but I treated him as a guest and asked him to stay with me. I am pleased with his manners and decided to treat him as my own son. 

ఢిల్లీ నుచి వఛ్చిన కుర్రవాడికి నా బిడ్డలా భావించుకుని చదువు చెప్పాలి అనుకున్నాను. వాడు నిజంగా నా బిడ్డే అయ్యాడు. నాకు తెల్లవారు ఝామున 3 గంటలకి లేచి చదువుకోడం అలవాటు.  కంప్యూటర్ గెస్ట్ రూంలో ఉంటుంది. నా పరిస్థితి అర్ధం చేసుకుని వాడు కూడా లేవడానికి వెనుకాడలేదు. రెండు రోజులు లేపడానికి మొహమాట పడ్డాను. వాడు నన్ను " నన్న" అని పిలిచేవాడు. ( నాన్న అని పలకడం రాదు , తెలుగు అంతా తప్పులుగా పలుకుతాడు ) బాగా కలిసి పోయాడు . దాంతో ఉదయాన్నే" గుటెన్ మోర్గన్," అని లేపేవాడిని.

మా మధ్య సంభాషణ అంతా జర్మన్ లో సాగేది. రోజుకి 6 క్లాసులు చెప్పేవాడిని. 7 గంటలకి ఒక జర్మన్ క్లాస్ ఉంది 11 గంటలకి ఒక జర్మన్ క్లాస్ ఉంది . ఆ రెండు క్లాసులలో విద్యార్థులతో ప్రాక్టీస్ చేసేవాడు. మొదటి రెండురోజులు ఆ రెండు క్లాసులు వినే వాడు. మూడోరోజునుంచి మొదలయ్యింది తెల్లవారు ఝామున 3 గంటల క్లాస్. మద్యానం భోజనం తరువాత ఓ గంట విరామం. తరువాత మళ్లీ మొదలయ్యేది. 


తరువాత టీ బ్రేక్ తరువాత సాయంకాలం క్లాస్ . ఎక్కడికైనా బయటకి వెళ్ళితే తీసుకెళ్లే వాడిని కానీ సంభాషణ మాత్రం జర్మన్ లో నే కొన సాగేది. క్లాస్ కి ముందు క్లాస్ , క్లాస్ తరువాత క్లాస్ , భోజనానికి ముందు , భోజనం తరువాత క్లాస్ , పడుకునేముందు ఒక ప్రాక్టీస్ సెస్సన్ ఉండేది. సరదా కబుర్లు జర్మన్ లో చెపితే వినేవాడు. ఒకొక్క విషయాన్ని " ఎక్కడికి వెళుతున్నావు? లేదా టైం ఎంత ? " లాంటి విషయాలని రోజులో ఒక 50 సార్లైనా చెప్పేవాడిని. అయినప్పటికీ మర్చిపోతుండేవాడు. 

ఒక వారం రోజులు ఇబ్బంది పడ్డాడు. ఒక రోజు నిద్రలేపలేదు , క్లాస్ కి వద్దని చెప్పాను. వాళ్ళ అమ్మ మచిలీపట్నం తీసుకెళ్లింది. సముద్రం చూసి వచ్చాడు . ఢిల్లీ లో సముద్రం లేదు కదా తెగ సంబరపడ్డాడు. బీచ్ లో ఆడు కున్నాడు. చెల్లికి రోల్డ్ గోల్డ్ ఆర్నమెంట్స్ కొన్నాడు.

మరసటి రోజు కూడా జర్మన్ లో మాట్లాడుకున్నాము కానీ క్లాస్ కి రాలేదు . ఆ తరువాతరోజు నాకు క్లాస్ కి రావాలని ఉంది అన్నాడు. అప్పటినుంచి నాప్రమేయం లేకుండా అనేక విషయాలు అడిగి తెలుసుకున్నాడు. నేను హిందీ లో మాట్లాడినా , జర్మన్ లో సమాధానం వచ్ఛేది. నేను నేర్పిన మాటలు జోకులు రిపీట్ చేసేవాడు. 

ఇన్ని నేర్చుకున్న మా పంజాబీ ముండ ( ముండ అంటే పంజాబీ లో అబ్బాయి అని అర్థం) రెండే రెండు తెలుగు మాటలు నేర్చుకున్నాడు " ఏవండీ , దోసెపిండి " విమానాశ్రయం లో వీడ్కోలు ఇస్తూ " ఏవండీ , దోసెపిండి" అన్నాను. వాతావరణం తేలిక పరచడానికి. "ఉంటాను నాన్న , నిన్ను మరువలేను అన్నాడు తెలుగులో. ఎవరి దగ్గరో నేర్చుకుని ఉంటాడు అనుకున్నాను." కళ్ళంట నీళ్లు వస్తుంటే గట్టిగా నవ్వేసాను . విమానం గాల్లోకి లేచిపోయింది. నేను కొలు కోడానికి 2 రోజులు పడుతుంది.